ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది. ఈ సమయంలో ప్రభుత్వ పాలన పైన ప్రజల మూడ్ ఏంటనేది కీలకంగా మారుతోంది. గ్రాడ్యుయేట్ల నాడి కూటమి పైన ఎలా ఉందో తెలిసిపోనుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సిద్దమైంది. దీంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్లు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ల సీట్ల గెలుపు కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఉభయగోదావరి, కృష్ణా - గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దులకు పీడీఎఫ్ మధ్య గట్టి ఫైట్ నెలకొంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానం లో మాత్రం యూనియన్స్ మధ్య పోటీ నెలకొంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన కూటమి పార్టీల కేడర్ ను అలర్ట్ చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ కల్పన.. డీఎస్సీ నిర్వహణ అమలు పైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన ఉభయ గోదావరి - కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు తున్నాయి.  దీంతో, మూడు పార్టీల నేతలతో చంద్రబాబు పలు మార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మార్గనిర్దేశం చేసారు. ప్రతి ఎన్నికా పరీక్షవంటిదేనని...మూడు పార్టీల అభ్యర్థులు కలిసి కట్టుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఇక.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos