తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ ఓ వీడియో విడుదల చేశారు. అనారోగ్యంగా కారణంగా ఆస్పత్రిలో చేరానని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని... వైద్యులు డిశ్చార్జ్ చేయగానే వస్తానని చేసుకుంటూ వీడియో విడుదల చేశారు. నా ఆరోగ్యం గురించి గానీ, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై గానీ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ప్రస్తుతం బాగానేz.. ప్రజలు, అధికారులు, మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం.
మరోవైపు, తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అదృశ్యమైన నలుగురు కార్పొరేటర్ లను భారీ భద్రత నడుమ ఎన్నికల కేంద్రానికి తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లు ఇవాళ ఎన్నికకు హాజరయ్యే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుండగా.. డిప్యూటీ మేయర్ పీఠం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి కూటమి పార్టీలు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos