ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ముఖ్యంగా శాసనమండలి వేదికగా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌కు మధ్య పోరు తీవ్ర రూపం దాల్చుతుంది. ఛైర్మన్ తీరుపై ఇప్పటికి గుర్రుగా ఉన్న ఆరు మంది.. త్వరగా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారు. అయితే ఛైర్మన్ పై పోరాటన్ని మరింత పెంచాలని భావించిన వీరంతా చివరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. వైసీపీని వీడి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, జకియా ఖానమ్‌, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌.. తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ, వాటిని మండలి ఛైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడం ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తోంది. ఛైర్మన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ సభ్యులు, ఏకంగా ఆయనపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీకి చెందిన ఈ ఎమ్మెల్సీలు కొద్దిరోజుల క్రితమే తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా కలిసి లేఖలు సమర్పించినా, ఛైర్మన్ వాటిని పెండింగ్‌లో ఉంచడంపై సదరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సాంకేతికంగా పదవుల్లో కొనసాగించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని వారు అనుమానిస్తున్నారు.

రాజీనామాలను వెంటనే ఆమోదించకుండా కాలయాపన చేయడం తమ హక్కులను కాలరాయడమేనని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఛైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వ ఒత్తిడి మేరకే పని చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రస్తుతం మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కావాల్సిన కనీస సభ్యుల మద్దతు తమకు ఉందని, వైసీపీ నుండి బయటకు వచ్చిన వారితో పాటు ఇతర మద్దతుదారులను కలుపుకుంటే ఛైర్మన్‌ను ఇరకాటంలో పెట్టవచ్చని వీరు యోచిస్తున్నారు. సాధారణంగా సభాపతి లేదా ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడం అనేది ఒక తీవ్రమైన నిర్ణయం. రాజీనామాలు ఆమోదించకపోతే, కనీసం ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా సభలో చర్చ జరిపి, ఛైర్మన్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాలని ఈ ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరగడం ఖాయం. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35. టీడీపీకి 10 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలంగా 35 మంది ఉండగా ఆరుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లు అయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos