తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ముందస్తుగానే వచ్చిన రుతుపవనాలు మందగించటంతో ఉక్కపోత పెరిగింది. వరుసగా వారం రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. కాగా, ఇప్పుడు రుతుపవనాల్లో తిరిగి వేగం..బంగాళాఖాతంలో ఆవర్తనం ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీతో పాటుగా, తెలంగాణలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.

నేడు ఏపీలోని మన్యం, అల్లూరిలో తేలికపాటి - ఓ మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మూడురోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 

ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే 17, 18, 19 తేదీల్లో మంచిర్యాల, ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆసిఫాబాద్, జయశంకర్ జిల్లాలకు హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాదుతో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి , వికారాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు, పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాతావరణ సూచనలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos