ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని విశాఖ రానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఫిక్స్ అయింది. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఏపీకి సహకారం అందుతున్న వేళ ఈ పర్యటనలో ప్రధాని పాల్గొంటున్న కార్యక్రమాలు ఏపీ భవిష్యత్ కు కీలక మలుపుగా మారనున్నాయి. ప్రధాని మోదీ ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ విశాఖ నగరంలో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో  ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎన్‌టీపీసీ నిర్మించనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటుకు శంకుస్థాపన, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను సభా వేదిక నుంచి చేపడతారు. ప్రధాని పర్యటనకు ముందే సీఎం చంద్రబాబు విశాఖకు వెళ్ళనున్నారు. 

కాగా ఈ నెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్‌కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఆ తర్వాత 8వ తేదీ జరిగే ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ సైతం పాల్గొంటారు. బహిరంగ సభలో  చంద్రబాబు, పవన్ మాట్లాడిన తరువాత ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతం కంటే భిన్నంగా మోదీ ప్రభుత్వం ఏపీకి పలు రంగాల్లో సహకారం అందిస్తోంది. అమరావతి, పోలవరం పైన ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. రూ 15 వేల కోట్ల రుణం అమరావతికి.. అదే విధంగా పోలవరం మొదటి దశ నిర్మాణం పూర్తికి కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. అదే విధంగా ఇప్పుడు రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

అమరావతి నుంచి కొత్తగా రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. అదే విధంగా జాతీయ రహ దారుల విషయంలోనూ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక, కొత్తగా ఏపీకి పరిశ్రమల ఏర్పాటులోనూ కేంద్రం సహకారం అందిస్తోంది. ఇప్పుడు రాజకీయంగానూ ఏపీలో బలోపేతం పైన ప్రధాని మోదీ ఫోకస్ చేసారు. అందులో భాగంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే బీజేపీ నేతలు కొత్త వ్యూహాలతో ఏపీ లో అడుగులు వేస్తున్నారు. ప్రధాని పర్యటన కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos