తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని, అందుకే జగన్‌ను, ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డిని కాపాడటం కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రస్తావిస్తూ, ఈ కేసులో మళ్లీ విచారణ ఎందుకు చేపట్టరని ప్రభుత్వాన్ని షర్మిల సూటిగా ప్రశ్నించారు. "వై నాట్?" అంటూ నిలదీశారు. ఇన్నేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా కుమార్తె సునీత చేస్తున్న పోరాటంలో పూర్తి న్యాయం ఉందని, ఆమెకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "సీబీఐ అనేది మోదీ చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయింది. నిజంగా సీబీఐ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈపాటికే దోషులకు శిక్ష పడేదని" అన్నారు. హత్య జరిగినప్పుడు సంఘటన స్థలంలో అవినాశ్ రెడ్డి ఉన్నారని చెప్పడానికి గూగుల్ మ్యాప్ లొకేషన్లతో సహా బలమైన ఆధారాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, అవినాశ్ రెడ్డిని కాపాడటానికే దర్యాప్తును నీరుగారుస్తున్నారని ఆమె ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని సునీత చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని షర్మిల పేర్కొన్నారు. 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos