అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావవతి రానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పిటికే ప్రధాని సభ జరిగే ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించగా.. తాజాగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని రాక సందర్భంగా 6 వేల మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు మంత్రి అనిత వెల్లడించారు. అలానే మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక అమరావతి పనుల పునఃప్రారంభ సభకు రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ సభకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు.

రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు.. వంశపారంపర్యంగా వచ్చిన భూములను త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వారిని తగిన రీతిలో గౌరవిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే సభకు కుటుంబ సమేతంగా హాజరుకావాలంటూ.. సీఆర్డీఏ సిబ్బంది.. అమరావతికి భూములిచ్చిన రైతుల ఇంటికెళ్లి మరీ ప్రత్యేక ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఈ పత్రికలపై ‘అమరావతి రైతు’ అని ముద్రించారు. సభలో పాటించాల్సిన సూచనలు, నియమాల గురించి అందులో పేర్కొన్నారు.

సభకు హాజరయ్యే రైతులు.. మధ్యాహ్నం 2 గంటల్లోపు సభా స్థలికి వచ్చి వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలని, పత్రికతో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డునూ తీసుకురావాలని సీఆర్డీఏ సిబ్బంది పేర్కొన్నారు. మంగళవారం రాజధాని గ్రామాల్లో ఈ ఆహ్వాన పత్రికల పంపిణీ చేపట్టారు. పలుచోట్ల బొట్టు పెట్టి మరీ రైతులను ఆహ్వానిస్తున్నారు. సోమవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో రైతులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రైతులు కుటుంబంతో సహా సభకు హాజరు కావాలని చంద్రబాబు కోరారు. సభా వేదిక వద్ద కూడా రైతుల కోసం ప్రత్యేకంగా 3 గ్యాలరీలు కేటాయించారు.

మోదీ అమరావతి పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
2వ తేదీ మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రధాని మోదీ సచివాలయం హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.
3:32కు మోదీ వేదికపైకి వస్తారు.
3:50కి అమరావతి పనులకు సంబంధించి 11 నిమిషాల వీడియోను వీక్షిస్తారు.
4:05 గంటల నుంచి 40 నిమిషాలపాటు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత 4:45 గంటలకు మోదీ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos