ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మోహన్‌బాబు రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో వివాదాలతో మోహన్‌బాబు మనస్థాపానికి గురైన నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్ మంత్రి లోకేష్ ను కలిసారు. ఈ సమయంలోనే మోహన్‌బాబు వేగంగా పావులు కదిపి... కొత్త నిర్ణయం దిశగా ప్రకటన కు సిద్దమయినట్లు తెలుస్తోంది.
మోహన్ బాబు ... ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా .. 1995 నుంచి 2001 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించి.. ఆ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు. వైఎస్ కుటుంబంతో మోహన్ బాబుకు వియ్యం ఉంది. 2019 లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్‌బాబు కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కుతాయని అందరూ భావించారు. కానీ, మోహన్ బాబు కు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో వైసీపీతోనూ మోహన్‌బాబు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో మంచు విష్ణు తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మోహన్ బాబు ఆ సమయంలో బీజేపీలో చేరుతారనే సంకేతాలు ఇచ్చారు.
కాగా, కొంత కాలంగా మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. కేసుల వరకు వెళ్లాయి. ఈ మధ్య కాలం లోనే మోహన్‌బాబు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినప్పుడు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆ సమయంలోనే రాజకీయంగా చర్చించారనే ప్రచారం సాగింది. కానీ, సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు మోహన్‌బాబు వెల్లడించారు. ఇక.. తాజాగా సంక్రాంతి సమయంలో మోహన్‌బాబు విద్యాసంస్థల ముందు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు కొత్త చర్చకు కారణమయ్యాయి. అక్కడే చంద్రబాబుతో మోహన్ బాబు దిగిన ఫొటో ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు.
ఇదే సమయంలో మంచు మనోజ్ విషయానికొస్తే .. ఆయన నేరుగా నారావారిపల్లిలో లోకేష్ తో సమావేశం అయ్యారు. మనోజ్ తొలి నుంచి టీడీపీ - జనసేన ముఖ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటు మోహన్ బాబు టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం.. ఇటు మనోజ్ ప్రయత్నాలతో ఎవరు ఎప్పుడు పార్టీలో ఎంట్రీ ఇవ్వనున్నారనే చర్చ సినీ - పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా సాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos