తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు.. అదే సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సారి వర్షాకాలం ముందే రానున్నట్లు వెల్లడించింది. మే 27వ తేదీన నైరుతీ రుతు ప‌వ‌నాలు కేర‌ళ‌ను తాక‌నున్న‌ట్లు పేర్కొంది. ఇక రానున్న రెండు రోజుల్లో ఏపీలో అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ అయింది.

నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో అండ మాన్ ను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 27న కేరళను తాకనున్నట్లు శాఖ అధికారులు వెల్లడించారు. అంచ‌నా వేసిన‌ట్లు ముందుగానే రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను చేరితే, అప్పుడు 2009 త‌ర్వాత తొలిసారి వ‌ర్షాకాలం ముందుగా వ‌స్తున్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. 2009 సంవ‌త్స‌రంలో మే 23వ తేదీన నైరుతి రుతుపవనాలు కేర‌ళ‌ను తాకిన‌ట్లు ఐఎండీ డేటా చెబుతోంది. సాధార‌ణంగా జూన్ ఒక‌టో తేదీ నాటికి కేర‌ళ‌లోకి నైరుతీ రుతుప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయి. ఈ రుతుప‌వ‌నాల వ‌ల్లే దేశంలో వ‌ర్షాకాలం ప్రారంభం అవుతుంది.

ఆ త‌ర్వాత జూలై 8వ తేదీలోగా దేశ‌వ్యాప్తంగా ఆ రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తాయి. ఇక సెప్టెంబ‌ర్ 17వ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగ‌మ‌నం అవుతాయి. అక్టోబ‌ర్ 15వ తేదీలోగా పూర్తి ఆ రుతుప‌వ‌నాలు వెళ్లిపోతాయి. 2025 వ‌ర్షాకాలంలో.. సాధార‌ణం క‌న్నా అధికంగానే వ‌ర్షం కురు స్తుంద‌ని ఏప్రిల్‌లో ఐఎండీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఎల్ నినో ప‌రిస్థితులు ఉండ‌బోవ‌ని ఐఎండీ పేర్కొన్న‌ది. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఈసారి నాలుగు నెలల్లో వ‌ర్షపాతం నార్మ‌ల్ స్థాయి క‌న్నా ఎక్కువే ఉంటుంద‌ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos