గన్నవరం టీడీపీ కార్యాలయ విధ్వంసం కేసులో వైసీపీ కి చెందిన 11 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారందరూ ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ అనుచరులే. ఈ దాడి కేసులో వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని శుక్రవారం తెల్లవారుజామున వారి ఇళ్లే వద్ద అరెస్ట్ చేశారు. ఇదే కేసులో విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో ఆ పార్టీ నేతల పైనా, అప్పటి ప్రభుత్వం పైనా తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రతిపక్ష టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడి కేసులో నిందితులను అరెస్టు చేయడంతో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు తాజాగా వంశీ అనుచరులుగా ఉన్న నిందితులను అరెస్టు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos