వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. లిక్కర్ కేసులో ఏ-4గా ఉన్న మిథున్ రెడ్డి పైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ నెల 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తరువాత తిరిగి మిథున్ సరెండర్ అయ్యారు. ఇక.. రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ జరిగింది. దీంతో.. ఏసీబీ కోర్టు కండీషన్లతో బెయిల్ మంజూరు చేసింది.

ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కండీషన్లను విధించింది. 71 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో ఉన్నారు. లిక్కర్ కేసులో ఏ-4గా ఉన్న మిథున్ మొత్తం స్కాంలో మాస్టర్ మైండ్ గా సిట్ పేర్కొంది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మిథున్ ను కోర్టు అనుమతితో సిట్ రిమాండ్ కు తీసుకొని విచారణ చేసింది. ఇప్పుడు బెయిల్ మంజూరు కావటంతో మిథున్ రేపు మంగళవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మిథున్ కు బెయిల్ రావటంతో ఈ కేసులో ఇప్పటికే అయిదుగురు నిందితులకు బెయిల్ దక్కినట్లు అయింది. మరోవైపు ఈ కేసులో బెయిల్ దక్కించుకున్న దనుంజయ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్పల పైన సిట్ హైకోర్టును ఆశ్రయించింది. వీరి బెయిల్ రద్దు చేయాలని కోరింది. ప్రభుత్వం తరపున సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే, 90 రోజులు రిమాండ్ లో ఉన్నా.. ఎలాంటి నేర నిరూపణ జరగలేదని... బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారని ఆ ముగ్గురి తరపు న్యాయవాదులు వాదించారు. కాగా, ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సమయంలో ప్రతీ సోమ, శుక్రవారాలు లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. రూ 2 లక్షలతో రెండు షూరిటీలు ఇవ్వాలని నిర్దేశించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos