ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పాలనాదక్షుడని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. చంద్రబాబు విజన్ ఉన్న నేత, సంపదను సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడని కితాబునిచ్చారు. విద్యావేత్తలు, మేధావులకు చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కరిగిపోయే మనసున్న నేత అని అన్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. మోదీకి నీరాజనం పలికేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖ అభివృద్ధికి కావాల్సిన చర్యలను ప్రధాని తీసుకుంటారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.

ప్రధాని మోదీ విశాఖ సభ వేదికగా 12కు పైగా ప్రాజెక్టుల  శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ను ప్రారంభిస్తున్నారు. దీనివల్ల 57 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos