టీటీడీ కొత్త కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయిన సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర ఇవాళ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 10:08 నిమిషాలకు.. తాత్కాలిక ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి నుంచి బాధ్యతలను స్వీకరిస్తారు. శ్రీవారి ఆలయం ఆవరణలో ఈ కార్యక్రమం జరుగనుంది. అంతకుముందు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. అనంతరం రోజువారీ సమీక్ష సమావేశాలు, తిరుమలలో ఈ నెల 26న ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించే అవకాశం ఉంది. బాధ్యతలను స్వీకరించడానికి గురువారం రాత్రే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేశారు. సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ మురళీకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. మర్యాదపూరకంగా కలిశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం తలెత్తిన అనంతరం బదిలీ వేటును ఎదుర్కొన్న రెండో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. తొలుత శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సింఘాల్ టీటీడీ ఈఓగా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఆయనపై కూడా వేటు పడింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సింఘాల్ ను తప్పించింది. గతంలో ఈవోగా పని చేసిన సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది ఈ నివేదిక.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos