ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తన తండ్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టిన ఆయన, చంద్రబాబు నాయకత్వ పటిమను, దార్శనికతను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు కొత్త రూపాన్నిచ్చి, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడమే కాకుండా, పటిష్ఠమైన వ్యవస్థలను నిర్మించిన శకం ఇదని లోకేశ్ అభివర్ణించారు.

పరిపాలనలో టెక్నాలజీని జోడించడం, పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలు కల్పించడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని లోకేశ్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ వంటి వాటితో రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టారని, భవిష్యత్ నగరాలకు ప్రతీకగా అమరావతిని నిర్మించాలనే సంకల్పాన్ని చాటారని గుర్తుచేశారు. జవాబుదారీతనంతో కూడిన వేగవంతమైన పాలన అందిస్తూ, పౌరులకు, సంస్థలకు సాధికారత కల్పించే వేదికలను నిర్మించారని వివరించారు. పేదరిక నిర్మూలన పథకాలు, రిజర్వేషన్ల అమలుతో సామాజిక న్యాయం అందించడంలో చంద్రబాబు ఎంతో కృషి చేశారని లోకేశ్ ప్రశంసించారు.

రాయలసీమ సాగునీటి సమస్యపై చంద్రబాబు చూపిన చొరవను లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తరలించి కరవుపీడిత రాయలసీమను సస్యశ్యామలం చేశారని అన్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి, గ్రామాల్లో చెరువులను నింపి రైతుల ఆదాయాన్ని స్థిరపరిచారని తెలిపారు. పోలవరం, బనకచర్ల వంటి ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "ఇంట్లో ‘నాన్న’ - ఆఫీసులో ‘బాస్’ అని పిలవడం నా అదృష్టం. ఆయన అనుభవం కలిగిన యువకుడు. స్పష్టత, ధైర్యం, నమ్మకంతో కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని లోకేశ్ తన పోస్టులో ఉద్వేగంగా పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos