ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవనుండటంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఏడాది ఉత్సవాలు చేస్తోంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది అంటూ.. ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.

ఈ ఉత్సవాల్లో భాగంగా జనసేన నేతలు, శ్రేణులు తమ వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, ముగ్గుల పోటీలు నిర్వహించాలనీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి దిశానిర్దేశం అందింది. దీంతోపాటు సాయంత్రం దీపావళి తరహాలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలని సూచించారు. ఈ వేడుకలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్టులు రూపంలో ప్రదర్శించాలని పార్టీ కోరుతోంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపెయిన్‌కి కూడా జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

ఏపీలో గత ఏడాది మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. అయితే ఈ క్రమంలోనే ఏపీలో కూటమి రికార్డు విజయం సాధించిన జూన్ 4వ తేదీ వేడుకలు నిర్వహించాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్య పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos