ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఎమ్మెల్యేల కోటా భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయి నాగబాబు అభ్యర్థిత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్ధుల ఎంపికపై వారు కొద్ది సేపు చర్చించినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం మండలిలో జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. మంత్రి వర్గంలో ప్రస్తుతం పవన్‌తో పాటు కందుల దుర్గేష్‌ ఉన్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించడంతో మూడో మంత్రి పదవి కూడా జనసేనలో అదే సామాజిక వర్గానికి దక్కనుంది. మరోవైపు టీడీపీలో కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న వారి జాబితా భారీగా ఉంది. ఎన్నికల పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారంతా ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. చంద్రబాబును, లోకేష్‌ను ప్రసన్నం చేసుకోడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అశోక్‌ బాబు వంటి నేతలుఎమ్మెల్సీ స్థానం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో మిగిలిన నాలుగు స్థానాలపై పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ కూడా ఒక స్థానాన్ని కోరే అవకాశం ఉంది. మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, విశాఖకు చెందిన మహ్మద్ నజీర్ అసెంబ్లీలో దర్శనం ఇచ్చారు. దువ్వారపు రామారావుకు మళ్లీ అవకాశం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరాలని విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి సమావేశమై నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారంతా ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos