మెగా బ్రదర్ నాగబాబు ఏపీ కేబినెట్ లో చేరేందుకు రంగం సిద్దమైంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నాగబాబు ఏపీ మంత్రి కావటం ఖాయమైంది. ఎమ్మెల్సీ గా ఎన్నికైన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా చర్చ జరిగింది. అయితే, సామాజిక - పార్టీ సమీకరణాలు దెబ్బ తినకుండా నాగబాబును మంత్రివర్గం లోకి తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త ఫార్ములా అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

నాగబాబు 2024 ఎన్నికల సమయంలో అనకాపల్లి ఎంపీగా.. ఆ తరువాత రాజ్యసభకు పంపేలా తొలుత పవన్ భావించారు. అయితే, పొత్తుల లెక్కల్లో భాగంగా ఎంపీ సీటు.. రాజ్యసభ స్థానం రెండు నాగబాబుకు దక్కలేదు. దీంతో, ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నట్లుగా నేరుగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే, నాగబాబును మంత్రి చేయటం ద్వారా పవన్ తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చారని.. ఒకే వర్గానికి జనసేన నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుందనే చర్చ తెర మీదకు వచ్చింది. దీనిని పవన్ తొలుత సమర్ధించుకున్నా.. ఆ తరువాత పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాజకీయంగా విమర్శకులకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు.

ఈ క్రమంలో... నాగబాబును మంత్రిని చేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఆషాడ మాసం తరువాత మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఉండేలా నిర్ణయించారు. జూలై చివరి వారంలోనే స్వల్ప ప్రక్షాళనతో నాగబాబుకు మంత్రి పదవి దక్కేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా జనసేన నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో బీసీ, ఎస్సీ వర్గాలకు అవకాశం ఇవ్వకపోవటంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు నాగబాబుకు ఇవ్వటం ద్వారా మరోసారి కాపు వర్గానికే పార్టీలో పదవులు ఇస్తున్నారనే చర్చకు అవకాశం వస్తుంది. దీంతో, కొత్త ఫార్ములా పైన చర్చ చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం.

అందులో భాగంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే సమయంలోనే జనసేన నుంచి ఒక మంత్రికి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి .. ఆ స్థానంలో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నాగబాబు కోసం పార్టీ నుంచి ఉన్న మంత్రిని తప్పిస్తే ఎలాంటి స్పందన ఉంటుందనే సందేహం వెంటాడుతోంది. తప్పించిన మంత్రి స్థానంలో ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన కొణతాల రామక్రిష్ణకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే, ఈ ఫార్ములా పైన పవన్ దే తుది నిర్ణయం కానుంది. నాగబాబుకు మంత్రి పదవి ఖాయం గా కనిపిస్తున్న వేళ... ఇప్పుడు పవన్ తన పార్టీ నుంచి మంత్రుల విషయంలో సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos