టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు శనివారం ఉద‌యం విజయవాడ ఇంద్రకీలాద్రిపై సందడి చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన బాలకృష్ణకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శనం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. “లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని” ఆయన తెలిపారు. అమ్మవారి దృష్టిలో అందరూ సమానమేనని, ఆమె ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లను బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని కొనియాడారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, నిరంతరాయంగా దర్శనం కల్పించడం అభినందనీయమని దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos