టాలీవుడ్ దివంగత నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రజలకు సేవలు అందించిన హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నందమూరి, నారా కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఘన నివాళి అర్పిస్తున్నారు. నందమూరి హరికష్ణ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. తమ మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని తాము పంచుకున్నామని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకే కాదు, టీడీపీ  కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అని కొనియాడారు.

హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రజలకు హరికృష్ణ విశేష సేవలందించారని గుర్తుచేసుకున్నారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారని లోకేష్ పేర్కొన్నారు. హరి మామయ్య లేనిలోటు మాకు తీర్చలేనిదని అన్నారు. సినీ, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా నారా లోకేష్ స్మరించుకున్నారు. నందమూరి హరికృష్ణ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా హరికృష్ణకు ఘన నివాళులు అర్పించారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో విశేష సేవలు అందించిన వ్యక్తి హరికృష్ణ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. జోహార్ హరన్న.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామంటూ ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు. 

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ నందమూరి తారక రామారావుకు మూడో కుమారుడు. హరికృష్ణ 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ప్రమాదంలో కారు పల్టీలు కొట్టడంతో తీవ్రగాయాలలైన హరికృష్ణను నార్కట్‌పల్లి లోని కామినేని హాస్పిటల్ కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ 2014 లో నల్గొండకు సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రస్తుతం హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ టాలీవుడ్ లో హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos