మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మచిలీపట్నంలోని రామానాయుడు పేట సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు పార్టీ జెండా ఆవిష్కరణ కోసం జెండా దిమ్మెను నిర్మించే ప్రయత్నం చేయడంతో ఈ వివాదం మొదలైంది. పేర్ని నాని నివాసానికి సమీపంలోనే ఈ నిర్మాణం జరుగుతుండటంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దీనిని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుండగా.. తమ పార్టీ జెండాను ఆవిష్కరించుకునే హక్కు తమకు ఉందని జనసేన శ్రేణులు వాదించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఘర్షణకు దారితీసింది.

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు మచిలీపట్నంలో భారీగా మోహరించారు. ముఖ్యంగా పేర్ని నాని నివాసం, కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, అటువైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. కార్యాలయ సిబ్బందిని సైతం లోపలికి అనుమతించకపోవడంపై పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు చెబుతున్న కారణాలను ఆయన తప్పుబట్టారు. కేవలం తమ పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవడానికే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని, అధికార పక్ష కార్యక్రమాలకు లేని ఆంక్షలు తమకెందుకని ఆయన హడావుడి చేశారు. ఈ ఘటన కేవలం జెండా గొడవగానే కాకుండా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మచిలీపట్నంలో రాజకీయ ఆధిపత్య పోరుగా మారింది. జనసేన నాయకులు పోలీసుల అండతోనే ఇక్కడ జెండాలు పాతేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆంక్షలు విధించామని పోలీసులు చెబుతున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్దఎత్తున మోహరించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మచిలీపట్నంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

ఘర్షణకు సంబంధించి ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. జెండా దిమ్మెనిర్మాణం వద్ద ప్రస్తుతం పోలీసు పహారా కొనసాగుతోంది. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఈ వివాదం సందర్భంగా పేర్ని నాని పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదం అవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos