ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం భువనేశ్వరి చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ పురస్కారం ఆమెకు, ఆమె బృందానికి దక్కాల్సిన సరైన గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కృషి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ (సౌత్ జోన్) నారా భువనేశ్వరికి 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్' అవార్డును ప్రకటించింది. డెయిరీ రంగంలో ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు అందుకోవడంపై భువనేశ్వరి స్పందించారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. భారత డెయిరీ రంగం అభివృద్ధి, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-28-45-0945.jpg

రాజకీయ ప్రేరేపిత చర్యలకు కోచింగ్ కేంద్రాలు వేదికలు కావొద్దు.. జీవో నెంబరు 9 మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు..   అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు
2026-09-15 Time: 03:28:45

17-21-55-0955.jpeg

పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు పేదల సేవలో సీఎం చంద్రబాబు
2026-09-01 Time: 05:21:55

18-29-57-0857.jpg

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను  ప్రారంభించిన సీఎం చంద్రబాబు 
2026-08-31 Time: 06:29:57

13-55-37-0837.jpg

విశాఖలో ఏఐజీ(AIG) హాస్పిటల్స్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన..  రూ.2వేల కోట్ల పెట్టుబడి, వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మాణం
2026-08-31 Time: 01:55:37

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

Related Videos