"శభాష్ నారా లోకేష్!" అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అభినందించడం, నేటి యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంలో మంత్రి నారా లోకేష్ కృషికి లభించిన గొప్ప గుర్తింపు. "యోగాను కేవలం ఒక దినోత్సవంగా కాకుండా, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక సామాజిక ఉత్సవంగా తీర్చిదిద్దాలనే లోకేష్ ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టేందుకు గత నెలన్నర రోజులుగా ఆయన చేసిన అవిశ్రాంత కృషి అభినందనీయం. ఇటువంటి బృహత్తర సామాజిక కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించి, దేశ ప్రజలందరికీ ఒక ఆదర్శ నమూనాగా నిలపడం లోకేష్ కార్యదక్షతకు నిదర్శనం." అని ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్ ను ప్రశంసించారు.

లోకేష్ దార్శనికత: విశాఖకు ప్రపంచ ఖ్యాతి, పెట్టుబడుల ఆకర్షణ 

నారా లోకేష్ విజన్ కేవలం యోగా దినోత్సవం విజయంతో ఆగిపోదని స్పష్టమవుతోంది. ఆయన ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజాలను విశాఖకు తీసుకువచ్చి, నగరాన్ని సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు యోగా డేను ఒక అవకాశంగా మలుచుకుని, దాని ద్వారా విశాఖను దేశవిదేశాల్లో దృష్టిలో పడేలా చేశారు. యోగా డే గిన్నిస్ రికార్డు ప్రయత్నం ద్వారా వైజాగ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు, విశాఖకు అనేక పెట్టుబడులను ఆకర్షించే బృహత్తర లక్ష్యంతో లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆయన నిబద్ధత, దార్శనికత విశాఖ భవిష్యత్తుకు శుభసూచకం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos