కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసి షాక్‌కు గురయ్యానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన వివరాలు తెలియగానే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వాడు ఎవడైనా ఉక్కుపాదంతో అణచివేస్తామని నారా లోకేష్ హెచ్చరించారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.  గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు తునిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తుని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను.. తాతయ్యని అని చెప్పి ఓ వ్యక్తి బయటికి తీసుకెళ్లాడు. ఓ సపోట తోటలో ఆ వృద్ధుడు, ఆ బాలికతో కలిసి ఓ యువకుడికి కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తోటలో వారు కనిపించడంతో ఆ యువకుడు వీడియో తీస్తూ వారిని ప్రశ్నించగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలికను స్కూలు నుంచి తీసుకెళ్లిన వ్యక్తిని తాటిక నారాయణరావుగా గుర్తించారు. తాటిక నారాయణరావు స్థానిక టీడీపీ నాయకుడని తెలిసింది. అలాగే గతంలో తుని మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పనిచేశాడు. మరోవైపు సపోట తోటలో వీడియో తీసిన యువకుడిని నారాయణరావును తాను మున్సిపల్ కౌన్సిలర్‌ని అంటూ బెదిరించడం కూడా అందులో నమోదైంది.

మరోవైపు యువకుడి ద్వారా విషయం బయటకు రావటంతో గ్రామస్థులు నారాయణరావును చితకబాదారు. పోలీసులు అక్కడకు చేరుకుని నారాయణరావును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పోక్సో కేసు నమోదు చేశారు. కాగా తుని గురుకుల పాఠశాల వద్దకు వెళ్లిన బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్థులు.. బయటి వ్యక్తితో బాలికను ఎలా బయటకు పంపిస్తారని నిలదీశారు. ఈ విషయంపై హెడ్మాస్టర్‌ను ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని బాలిక కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. బాలికను స్కూల్‌లో విచారించారు. మరోవైపు నారాయణరావుతో పాటుగా ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos