అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ అట్లాంటాలో ఓ ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తెలుగువారు హాజరయ్యారు . దీపావళి వేడుకలు, హలోవిన్ సంబరాలు జరుగుతున్నప్పటికీ నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ప్రవాసాంధ్రులు వచ్చారు.

అమెరికాలో ఉన్నానా.. అమలాపురంలో ఉన్నానా అని వచ్చిన జనాల్ని చూసి నారా లోకేష్ కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఏ మల్టీనేషనల్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పెట్టుబడుల పై చర్చించేందుకు మెయిల్ పెడితే చాలు ... వెంటనే స్పందిస్తున్నారని అన్నారు. సత్యనాదెళ్లకు మెయిల్ పెట్టినా వెంటనే కలిశారని గుర్తు చేసుకున్నారు. ఇదంతా చంద్రబాబు బ్రాండ్ అని లోకేష్ వ్యాఖ్యానించారు,

రాష్ట్రంలో ప్రస్తుతం కక్ష సాధింపులు లేని పాలన జరుగుతోందన్నారు. చంద్రబాబు అనుకుంటే గత ప్రభుత్వంలో వేధించిన వారిని జైల్లో పెట్టడం రెండు నిమిషాల పని మాత్రమేనని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు అంతా చట్టబద్దంగా జరగాలనుకుంటున్నారని తెలిపారు. రెడ్ బుక్ అమలు ప్రారంభమయిందన్న లోకేష్.. ఇప్పటికే రెండు చాప్టర్లుఅమలు చేశామని త్వరలో మూడో చాప్టర్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. నారా లోకేష్ కార్యక్రమానికి ఎన్ ఆర్ ఐ కోమటి జయరాంతో పాటు ఎన్నారైలుగాఉంటూ ఎమ్మెల్యేలుగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్, వెనిగండ్ల రాముతో పాటు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కూడా హాజరయ్యారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos