ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని మంత్రి నారా లోకేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగింది. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు, ప్రెసిడెంట్స్ , వైస్ ప్రెసిడెంట్‌లతో ... నారా లోకేష్ భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను నారా లోకేష్ వివరించారు.

సాధారణంగా అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వంలో కీ పొజిషన్లలో ఉన్న వారు ఎవరైనా అమెరికా వెళ్తే .,.. మొదటి రోజు నుంచి అన్ని పెట్టుబడులు వచ్చాయి.. ఇన్ని పెట్టుబడులు వచ్చాయంటూ ఉదరకొట్టే వార్తల్ని పీఆర్ విభాగం పంపుతుంది. ఎంవోయూలు చేసుకున్నారని చెప్పేవారు. నారా లోకేష్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కానీ ఆయన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా వంటి అన్ని అగ్రశ్రేణి కంపెనీల హెడ్ క్వార్టర్లకు వెళ్లారు. కీలక వ్యక్తులతో సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. వారికి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేశారు. ఆసియాలో.. ఇండియాలో ఎప్పుడు పెట్టుబడుల ప్రతిపాదనలు ఉన్నా ఏపీని కూడా పరిగణనలోకి తీసుకునేలా చేయగలిగారు.

నారా లోకేష్ అమెరికాలో అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేశారని అనుకోవచ్చు. బడా కంపెనీలన్నింటికీ ఏపీలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత, పెట్టుబడులు పెడితే వచ్చే ప్రయోజనాలు ఇలా అన్నింటిపై అన్ని కంపెనీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఓ మల్టీనేషనల్ కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే … ఒక్క వ్యక్తి నిర్ణయంతో అయ్యే పని కాదు. సీఈవోనో..యజమానో డిసైడ్ చేయలేరు. ఓ వ్యవస్థ పని చేస్తుంది. తమ పెట్టుబడులు ఎక్కడ సురక్షితమో.. ఎక్కడ లాభదాయకమో నివేదికలు తెప్పించుకున్న తరువాతనే ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ క్రమంలో వారు షార్ట్ లిస్ట్ చేసుకునే ప్రదేశాలే కీలకం. ఇప్పుడు ఆ షార్టులిస్టుల్లో ఏపీ ఉండేలా చేయడంలో లోకేష్ సఫలీకృతం అయ్యారని ఆర్థిక  నిపుణులు చెబుతున్నారు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి. అందుకే లోకేష్ పర్యటన సందర్భంగా … పెట్టుబడుల ప్రకటనలు లేకపోయినా ఇదొక అద్భుతమైన ప్రయత్నమని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos