కేంద్ర మంత్రులతో సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ తో సమావేశం అయ్యారు. ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ను కేంద్రం ప్రారంభించాలని భావిస్తున్న క్రమంలో.. దాన్ని విశాఖలో పెట్టాలని లోకేష్ కోరారు. మరికొన్ని కీలక అంశాలపై చర్చలు జరిపారు. బుధవారం కూడా నారా లోకేష్ డిల్లీలోనే ఉన్నారు. ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు.

మరోవైపు లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఏపీ రాజకీయాలపై చర్చలు కూడా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఓ ప్రత్యేకమైన ఎజెండాతో ఢిల్లీకి వెళుతున్నారని.. అదేమిటో బయటకు రాదని టీడీపీ వర్గాలంటున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేంద్ర స్థాయిలో చర్యలు ఉండేలా పకడ్బందీగా  అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

మరోవైపు.. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. లోకేష్ తనను కలవకపోవడంపై సరదాగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా వచ్చి కలవాలన్నారు. త్వరలోనే వచ్చి కలుస్తానని లోకేష్ చెప్పారు. ప్రధాని మోదీ బిజీగా లేని సందర్భం చూసుకుని ఆయనతో లోకేష్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు , పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్నందున… ఈ సారి ప్రధానితో భేటీ అయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఏపీ రాష్ట్రానికి సంబంధించి లోకేష్ .. ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తుండటంపై ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos