శాన్ ఫ్రాన్సిస్కో: ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యుఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా  ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. రాబోయే రోజుల్లో ఎపి స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు కాబోతోంది. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటి, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణయించాం. అధునాతన సాంకేతిక పరిజ్హానంతో త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఎఐ యూనివర్సిటీని ఏర్పాటుచేయబోతున్నాం. అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొన్న ఎపిలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ కోరారు.
ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ రంగస్వామి, యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కవితా మరియప్పన్ (జడ్ స్కేలర్), శివ శివరాం (సిఇఓ, క్వాంటమ్ స్కోప్), రమాకాంట్ ఆలపాటి (సిఇఓ, యూల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్), సోహిల్ చావ్లా (ఫౌండర్ & సిఇఓ టి సెకండ్), అన్యా మాన్యుయల్ (ప్రిన్సిపాల్, రైస్ హాడ్లీ గేట్స్ & మాన్యుయల్ ఎల్ఎల్ సి), రియా షిమా (గ్లోబల్ బిజినెస్ హెడ్, జెట్ సింథసిస్), డీన్ గార్ ఫీల్డ్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, నెట్ ఫ్లిక్స్), మిచైల్ డిపాలా కోయ్లే (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ, ఐబిఎం), నిక్ క్లెగ్ ( ప్రెసిడెంట్, మెటా గ్లోబల్ ఎఫైర్స్), బెకీ ఫ్రాసర్ ( వైఎస్ ప్రెసిడెంట్, క్వాల్కమ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), చంతాల్ అలకంత్రా (ఎండి, లాంరీసెర్చ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), ప్రభురాజా (ప్రెసిడెంట్, సెమీకండక్టర్స్ పొడక్ట్ గ్రూప్, అప్లయ్డ్ మెటీరియల్స్), గ్రేస్ కోహ్ (వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ రిలేషన్స్, సియానా), తోబి యాంగ్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్), స్టాట్ ఆంటోని (పార్టనర్, కోవింగ్టన్ & బర్లింగ్), ఎమి హరియానీ (సీనియర్ అడ్వయిజర్, యుఎస్ఐబిసి) , ఇండియాస్పోరా ప్రతినిధులు ముద్దు సుధాకర్ (ఆసియారా), శ్రీ సతీష్ అంబటి (హెచ్20 ఎఐ), భాస్కర్ శ్రీనివాసన్ (యావియేషన్ టెక్నాలజీ లిమిటెడ్), శ్యామ్ బాలాజీ (డెలాయిట్), సంజయ్ ఖండవేరు (ఐవిక్యాప్ వెంచర్స్), కృష్ణ యార్లగడ్డ (ఫాల్కన్ ఎక్స్), ప్రభ భాష్యం (యాపిల్), ప్రియా రామచంద్రన్ (జోమ్ క్యాపిటల్), రాజీ భాస్కర్ (సూపర్ బ్లూమ్), రాజురెడ్డి (సియారా అట్లాంటిక్), రాకేష్ వైద్య నాథన్ (ధ జై గ్రూప్), రమణన్ షణ్ముగం (ఒవెన్యూ), రావి రవికుమార్ (కోటా క్యాపిటల్), సతీష కంచి (వన్ హబ్, పిఓఎస్), జియా రెహమాన్ (స్ప్రౌట్ ఎఐ), అనిల్ అద్వానీ (ఇన్వెంటస్ లా), నవ దావులూరి, శివచైతన్య (ఇంటరాక్ట్లీ ఎఐ), నవ్య దావులూరి (క్యూరీ ఎఐ), అంజి మారం (క్రిటికల్ రివర్), విశేష్ పువాడి (హెచ్ఎస్ బిసి), ప్రసాద్ ఆకెళ్ల (ఆప్టెస్సా), సంజయ్ వర్మ (అలిక్స్ పార్టనర్స్), మనోహర్ పాలూరి (మెటా), రాంభూపాల్ (డైకెమ్ పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos