ఏపీకి చెందిన గొల్లపూడి పంచాయతీకి ఆత్మనిర్బర్ పంచాయతీ అవార్డు దక్కింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండంలోని గొల్లపూడి పంచాయతీ జాతీయ అవార్డు సాధించింది. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో అవార్డుకు ఎంపికైంది. ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ వద్ద పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయని తెలిసిందే. పవన్ కళ్యాణ్ శాఖకు జాతీయ అవార్డు రావడంతో జనసేన శ్రేణులతో పాటు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పంచాయతీ అవార్డు 2025లో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డు ఇవ్వనున్నారు. బిహార్ లోని మధుబనిలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డుల అందజేత కార్యక్రమం జరగనుంది.

సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో జాతీయ స్థాయిలో గొల్లపూడి పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. దాంతో ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ప్రత్యేక అవార్డుకు ఎంపికైనట్లు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారులు తెలిపారు. గొల్లపూడి గ్రామపంచాయతీకి జాతీయ అవార్డు రావడంపై సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ హర్షం వ్యక్తం చేస్తోంది. గొల్లపూడి గ్రామపంచాయతీని... స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాలు ఇలాగే ముందుకు వెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos