ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం రంగాల్లో మరోమారు జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 'జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం'ను రాష్ట్రం సొంతం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిన్న జరిగిన జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎల్. శివ శంకర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్‌డీఏ) కేటగిరీలోని గ్రూప్-II రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఇంధన పొదుపు, వాతావరణ పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ పురస్కారం రాష్ట్రానికి మరో గర్వకారణమైన మైలురాయిగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సహకారం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మార్గదర్శకత్వంలోనే ఈ ఘనత సాధ్యమైందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) వివిధ రంగాల్లో సమర్థవంతమైన కార్యక్రమాలను అమలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని వివరించాయి. జాతీయ అవార్డుపై స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ సీఈవో నాగలక్ష్మి స్పందిస్తూ... ఇంధన సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో పెంచేందుకు మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు. ఏపీ 89.25 పాయింట్లతో గ్రూప్‌-2లో అగ్రస్థానంలో ఉందని, గత ఏడాది కన్నా 2.3 శాతం ఎక్కువని ఆమె చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos