ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల్ని స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది. ఈ కార్డుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. బ్యాంకు ఏటీఎం కార్డ్ సైజులో క్యూఆర్ కోడ్‌తో ఈ స్మార్ట్ రేషన్ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది.. అన్నీ కుదిరితే వచ్చే నెలలో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం.. మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటుంది. రేషన్ కార్డు నంబరు, రేషన్ షాపు నంబరు వంటి వివరాలు పొందుపరుస్తారు. కార్డు వెనుకవైపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేస్తారు.

రేషన్ డీలర్ల దగ్గర ఈ-పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింట్ చేయడం కోసం ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా.. ప్రస్తుతం కార్డుల్ని ముద్రిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి.. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది అర్హులైన పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా పక్కన పెట్టారు. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన కుమారులు, కూతుళ్ల ను స్ల్పిట్ చేయడం.. రేషన్ కార్డులలో కుటుంబసభ్యుల పేర్లు చేర్చడానికి, సభ్యుల పేర్లు తొలగించడానికి, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం ఉంది. మే నెల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ రేషన్ కార్డ్‌కు సంబంధించిన స్టేటస్‌ను చెక్ చేసుకునేందకు అవకాశం ఉంది. దీని కోసం ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ https://vswsonline.ap.gov.in/ ను ఓపెన్ చేసి.. హోమ్ పేజీలో 'Service Request Status Check' సెర్చ్ లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన నంబర్‌ను ఎంటర్ చేయాలి.. కింద క్యాప్చాను నమోదు చేసి సెర్చ్‌పైనే క్లిక్ చేయాలి. అప్పుడు రేషన్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది.. కార్డు ఏ దశలో ఉందో తెలుస్తుంది. ఒకవేళ పెండింగ్ ఉంటే.. ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందో చూడొచ్చు. రేషన్ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలుస్తుంది. మొత్తం మీద ఏపీలో అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డులపై క్లారిటీ వచ్చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos