ఏపీలో మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. మద్యం అమ్మకాల పెంపు .. రెవిన్యూ కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే రూ 99 కే క్వార్టర్ మద్యం కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది. త్వరలో బార్ల పాలసీ పైన తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే సమయంలో మద్యం అమ్మకాల విషయంలో మరో కొత్త ప్రతిపాదనతో సిద్దమైంది. ఇక నుంచి మద్యం కొనుగోలు సమయంలో ప్రతీ మందుబాబు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇందు కోసం కొత్త విధానాలను అందుబాటులోకి తెస్తోంది.

ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలతో పాటుగా నాణ్యత పైన మందుబాబుల నుంచి వారి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందు కోసం నేరుగా బార్లు, మద్యం షాపుల వద్ద అభిప్రాయాలు వెల్లడించే క్యూఆర్‌ కోడ్‌లు ఏర్పాటుచేసింది. ప్రతి బార్‌, షాపులో కౌంటర్‌, తాగే ప్రదేశం, బయట గోడలపైనా 4 నుంచి 5 చోట్ల క్యూఆర్‌ కోడ్‌లను ఎక్సైజ్‌ సిబ్బంది అతికించారు. వినియోగదారులు ఎప్పుడైనా ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అందులో ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడం ద్వారా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మందుబాబుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

కాగా, ఈ సర్వేలో వైన్స్‌ దుకాణాలకు 5, బార్లకు 3 ప్రశ్నలు పేర్కొంటారు. వాటి కింద అవును, కాదు అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిని ఎంపిక చేసిన తర్వాత పేరు, మొబైల్‌ నంబరు, నియోజక వర్గం, జెండర్‌, పుట్టిన తేదీ సమర్పించి అభిప్రాయాలను సబ్మిట్‌ చేయాలి. ఈ సర్వేలో వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టనుంది. అయితే, క్యూఆర్‌ కోడ్‌ సర్వేలో వివరాలు అడగటం సరికాదనే వాదన వినిపిస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత వివరాల్లో ఫోన్‌ నంబరు తప్పనిసరిగా సమర్పించాలి. మద్యం విషయంలో చేసే సర్వేలో నియోజకవర్గంతో సహా వ్యక్తిగత విషయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తమకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని వినియోగదారులు భావిస్తున్నారు. దానివల్ల ఎక్కువ మంది సర్వేలో పాల్గొనకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సర్వేలో ప్రభుత్వం పలు ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మార్పీ ధరలకు విక్రయాలు.. నాణ్యత.. దుకాణ సిబ్బంది ప్రవర్తన వంటి వాటి పైన ప్రధానంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. కాగా, మద్యంపై చేపడుతున్న సర్వే విషయంలో వినియోగదారుల నుంచి కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణంగా అంతా బాగుంటే వినియోగదారులు సర్వేలో పాల్గొనరు. ధరలు, నాణ్యత, బ్రాండ్ల లభ్యత వంటి వాటి పైన తాము ఫిర్యాదు చేయటం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తామిచ్చే ఫీడ్ బ్యాక్ కీలకమని ప్రభుత్వం భావిస్తే.. తమ ఫిర్యాదుల పైన తీసుకుంటున్న చర్యల గురించి తమకు సమాధానం పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు మద్యం దుకాణాల దగ్గర కొత్త హంగామా కనిపిస్తోంది. మందుబాబులు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos