ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో తాజాగా ఓ మహిళ భర్త అప్పు తీర్చలేదనే కారణంతో ఆమెను ఓ వడ్డీ వ్యాపారి చెట్టుకు కట్టేసి ఆమె పిల్లల ముందే కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం అదే రోజు స్పందించి చర్యలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై ఏపీ సర్కార్ కు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 16న కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో తన భర్త రుణం తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఒక మహిళను చెట్టుకు కట్టేసి ప్రజల సమక్షంలో కొట్టాడని మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వయంగా పరిశీలించినట్లు పీఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. మీడియా కథనాలు వాస్తవం అయితే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో కుప్పం ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది.

బాధితురాలి భర్త దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్థానిక వడ్డీ వ్యాపారి నుండి రూ.80,000 అప్పు తీసుకున్నాడు. కానీ దానిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. అతను గ్రామంలోని ఇతరుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అతను అప్పులు తిరిగి చెల్లించలేక గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుండి అతని భార్య రోజువారీ కూలీగా పనిచేస్తూ తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. అలాగే వాయిదాలలో అప్పుల్ని చెల్లిస్తోంది. ఇదే క్రమంలో కుమారుడి స్కూల్లో టీసీ తీసుకునేందుకు వచ్చిన ఆమెను పట్టుకుని మునిస్వామి అనే వ్యాపారి చెట్టుకు కట్టేసి ఆమె పిల్లల ముందే కొట్టాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్టు చేసి ఆమెకు 5 లక్షలు పరిహారం కూడా ఇచ్చింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos