పార్లమెంట్ సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై  చర్చ జరుగుతున్న క్రమంలో తీర్మానానికి టీఎంసీ సైతం మద్దతు ప్రకటించింది. ఈ రోజు, రేపు చర్చ జరగనుంది. ప్రభుత్వ సమాధానం తరువాత సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. కాగా.. ఈ అంశంలో వైసీపీ మద్దతు ఎవరికి.. ఓటింగ్ వేళ ఎవరి వైపు నిలుస్తుందనే చర్చ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ఎంపీలకు ఇదే అంశం పైన జగన్ స్పష్టత ఇచ్చారు.

ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది కీలకంగా మారుతోంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కు లోక్ సభలో ప్రాతినిధ్యం లేదు. మిగిలిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తమ పార్టీల వైఖరికే కట్టుబడి ఉంటాయి. ఏపీ నుంచి కూటమికి 21 మంది ఎంపీలు ఉండగా.. వారంతా ఎన్డీఏకు మద్దతుగా నిలుస్తారు. వైసీపీ నుంచి నలుగురు ఉన్నారు. వారు ఇప్పుడు ఈ చర్చలో ఎవరికి మద్దతుగా మాట్లాడుతారు... ఓటింగ్ జరిగితే ఎవరి వైపు నిలుస్తారనే చర్చ సాగుతోంది. అయితే, జగన్ ఇప్పటికే పార్టీ ఎంపీలతో ఇదే అంశం పైన పార్టీ వైఖరి తేల్చి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా.. ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన విధంగానే... స్పీకర్ కు అనుకూలంగా ఎన్డీఏ వైపే నిలవాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా, సభాపతిపై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సభలో హాజరైన, ఓటు వేసిన సభ్యులలో సగానికంటే ఎక్కువ సాధారణ మెజారిటీ అంటే 273 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం.. ఇండియా బ్లాక్ మొత్తం బలం సుమారు 234 సీట్లు. విపక్షాలన్నీ కలిసి ఓటేసినా ఎన్డీఏ మెజారిటీని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువ. అధికార ఎన్డీఏ బలం సుమారు 293 స్థానాలతో పటిష్ఠంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ, శిరోమణి అకాలీదళ్, స్వతంత్ర ఎంపీల మద్దతు కలిస్తే ఈ బలం 300 దాటుతుంది. ఇలా ఎన్డీఏకు స్పష్టమైన సంఖ్యాబలం ఉండటంతో స్పీకర్‌గా ఓం బిర్లాయే కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల వేళ ఎన్డీఏకు మద్దతు ఇస్తే భవిష్యత్ సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos