ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి స్పష్టత ఇచ్చారు. తన విధానం ఏంటో వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులను తానెప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ లోనూ అడ్డుకోనని తేల్చి చెప్పారు. తాజాగా కేంద్రం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల పైన కొర్రీలు విధించింది. ఇద్దరు సీఎంలు భేటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్రం వద్దే తమ వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దం అయింది. దీంతో, చంద్రబాబు మరోసారి తన వైఖరి పైన ప్రకటన చేసారు.
బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులను తానెప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు బాగుపడతారని ఉద్ఘాటించారు. మామిడి రైతులకు తాము చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను తాము పరిష్కరిస్తామని.. రైతులకూ తమపై నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.
వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా లాభాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నామని,మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు చేయాలని సూచించారు. ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏ పంట వేస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. తమిళనాడులో లేని ఫుడ్ ప్రాసెసింగ్ ఏపీలో ఉందని ఉద్ఘాటించారు. సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బనకచర్ల ప్రాజెక్టు పైన ఈ నెల 11న ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించేందుకు చంద్రబాబు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos