మాజీ సీఎం జగన్ జిల్లా పర్యటన వేళ మళ్లీ చర్చ మొదలైంది. జగన్ మెడికల్ కాలేజీల పరిశీలనలో భాగంగా ఈ నెల 9న నర్సీపట్నం వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహణకు నిర్ణయించారు. ఈ మేరకు పోలీసు అధికారులను అనుమతి కోరారు. దీని పైన జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ స్పష్టత ఇచ్చారు. జాతీయ రహదారి రోడ్డు మార్గంలో కూడళ్ల వద్ద జన సమీకరణ చేసే ఆలోచనలు చేస్తు న్నట్లు సమాచారం అందిందని... ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో మాజీ సీఎం జగన్ పర్యటించేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. తమిళనాడులో ఇటీవల విజయ్ నిర్వహించిన రోడ్ షోలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడ్డారని గుర్తుచేశారు. కరూర్ లో చోటుచేసుకున్నటు వంటి దురదృష్టకరమైన సంఘటనలు ఇక్కడ చోటు చేసుకోకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం జగన్ 63 కిలోమీటర్ల మేర కాన్వాయ్‌తో ప్రయాణించేందుకు అనుమతిని నిరాకరించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.

మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేసి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో వచ్చేందుకు ముందుకు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. కాగా, వైసీపీ నేతలు మాత్రం గతంలో జగన్ జిల్లాల పర్యటన సమయంలోనూ ఇదే రకంగా ఆంక్షలు విధించినా ప్రజల నుంచి స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు. పోలీసులు అనుమతి నిరాకరించినా జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకు వస్తారని తేల్చి చెబుతున్నారు. దీంతో.. మరోసారి జగన్ పర్యటన వేళ ఆంక్షలు.. రోడ్ షో నిర్వహణ అనే అంశాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos