వైఎస్సార్ జిల్లా రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి మహిళా అధికారిపై వేధింపులకు పాల్పడటం కలకలం సృష్టించిన ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ డీటీసీ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో .. ఆయన దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి శాఖాపరమైన విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలం, ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి అందడంతో డీటీసీపై సస్పెన్షన్ వేటు పడింది. డీటీసీని విధుల నుండి తొలగించి కేంద్ర కార్యాలయానికీ సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి మహిళా అధికారిపై వేధింపులకు పాల్పడి.. కలకలం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కడప రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నమహిళా ఎంవీఐ భర్త ఉద్యోగ రీత్యా పొరుగు జిల్లాలో పనిచేస్తారని తెలుసుకున్న చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉదయం నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె సీసీ కెమెరాల్లో అతడి రాకను గమనించి భర్తకు ఫోన్ చేసి చెప్పారు. సీసీ కెమెరాలలో డీటీసీ రాకను ఫోన్‌లో గుర్తించిన మహిళ భర్త అధికారి చేష్టలను గమనించారు. తలుపు తడుతూ మహిళా అధికారిణి పిలిచే ప్రయత్నం చేయగా ఆమె స్పందించక పోవడంతో ఆమె ఇంటి ముంగిట కూర్చున్నారు.
ఇవన్నీ గమనించిన అధికారిణి భర్త డీటీసీ చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేయగా.. స్పందించ కుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో పక్క జిల్లా నుంచి ఇంటికి వచ్చిన భర్త, ఆ తర్వాత భార్యను వెంటబెట్టుకుని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లి కీచక అధికారిని సిబ్బంది ముందు చితకబాదారు. దీంతో బాధితురాలి కాళ్లపై పడి క్షమించాలని డీటీసీ వేడుకున్నారు. అయినా ఈ వ్యవహారం కాస్త సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు కీచక డీటీసీ ని సస్పెండ్ చేశారు. కాగా ఈ డీటీసీ గతంలో బాపట్లలో పనిచేసిన సమయంలో కూడా మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos