ఏపీలో ఏప్రిల్ నెలలోనే ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఈసారి వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించనుంది. కాబట్టి విద్యార్థులు వాట్సాప్ (9552300009) ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలు పూర్తయి అప్పుడే 15 రోజులవుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరగ్గా.. రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకూ జరిగాయి.
ఇక పేపర్ వాల్యుయేషన్ జరగనుంది. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ ఉంటుంది. ఏప్రిల్ 15-20 మధ్య ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎప్పటిలానే https://bieap.apcfss.in/ లేదా https://bie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సప్ సేవలతో కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోవాలి.
ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు Hi అని టైప్ చేసి పంపించాలి. ఆ తరువాత సెలెక్ట్ సర్వీస్ కన్పిస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. అక్కడి నుంచి డౌన్‌లోడ్ ఎగ్జామ్ రిజల్ట్స్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు మీ మార్కుల మెమో పీడీఎఫ్ కాపీ వాట్సాప్‌కు వస్తుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos