స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై ఫోకస్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆదివారం నోటిఫికేషన్ వస్తే, సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జులై ఒకటో తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటనలో తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. రాజ్యసభ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీన నామినేషన్లు స్వీకరించడం, ఉపసంహరణ సైతం అదే రోజు ఉంటుందన్నారు. నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జులై 1న పూర్తవుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో తెలంగాణలో కాషాయ దళం పగ్గాలను బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి చేతికి అప్పగించింది అధిష్టానం. 2018 ఎన్నికలతో పోల్చితే 2023లో బీజేపీ ఎక్కువ సీట్లు, ఓట్ల శాతంతో స్పష్టమైన మార్పు చూపించింది. ఏపీలో ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా సైతం ఘన విజయం సాధించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos