వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా... తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ గడువు ఇప్పటికే పెంచేసారు. డెలివరీ మాత్రం ఆలస్యం అవుతోంది. యుద్ద కారణంగా భారీగా ధరలు పెంచినా.. సరఫరా మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మెరుగు పడలేదు. బుకింగ్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. దీంతో.. వంట గ్యాస్ బుకింగ్ చేయాలంటే కొన్ని నిబంధనలు తప్పని సరి చేస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బుకింగ్ గడువు పెంచిన కంపెనీలు ఇప్పుడు డెలివరీ కూడా ఆలస్యం చేస్తున్నాయి. కనీసం బుక్ చేద్దామన్నా కొన్నిసార్లు అవ్వడం లేదు. సరిపడా గ్యాస్​ నిల్వలు ఉన్నాయని.. ఆందోళన అవసరం లేదని ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో, గ్యాస్ బుకింగ్​ సేవలను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి గ్యాస్​ బుక్​ చేయాలంటే ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని చెబుతోంది. ఇది వరకు రాయితీ డబ్బుల జమ కోసం మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉండగా, ప్రస్తుతం గ్యాస్ బుక్​ చేయాలన్నా ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. అప్పటిలోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.

కాగా, ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వినియోగదారులకు మరోసారి అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చేయని వారు మాత్రం ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని సూచిస్తుంది. వినియోగదారులు మీ-సేవ, గ్యాస్​ ఏజెన్సీలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కేవైసీ విధానం అమలు చేయటం ద్వారా వంట గ్యాస్ కష్టాల వేళ సరఫరా వ్యవస్థ పక్క దారి పట్టకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వంట గ్యాస్ సంస్థలకు చెందిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ-కేవైసీ ప్రక్రియను ఫ్రీగా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇందుకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి. సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ప్రక్రియను పూర్తి చేసుకోవ చ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 31 లోగా ఈ కేవైసీ పూర్తి చేయనివారు రాయితీతో పాటు గ్యాస్ బుక్ చేసే అవకాశాన్నీ కోల్పోతారని అధికారులు స్పష్టం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos