ఎన్టీఆర్ అని కోట్లాదిమంది అభిమానులు ముద్దుగా పిలుచుకునే నందమూరి తారక రామారావు సినీ జీవితంలోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఇవాళ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో ఇవాళ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వజ్రోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ప్రారంభించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ఏడాదిపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలను విజయవాడ లో మాత్రమే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు తదితర నగరాలలోనూ నిర్వహిస్తామన్నారు. తారకరామం పేరుతో అన్న గారి అంతరంగం పుస్తకాన్ని వేడుకల్లో ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం మనదేశం నిర్మాత కృష్ణవేణి తదితర సినీ ప్రముఖులు హాజరవుతారు.
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. రాజకీయాల్లో, సినీరంగంలో ఎన్టీఆర్ ఒక ధృవతార అని.. ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడి సినీ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడం తెలుగుజాతి చేసుకొన్న అదృష్టమని వారు తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని వారు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos