నేడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 102వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీలో అధికార టీడీపీ మహానాడును జరుపుకుంటోంది. మహానాడు రెండవ రోజు ప్రతినిధులు సభ జరుగుతోంది. తొలి రోజైన మంగళవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాలను నేడు సభ ఆమోదించనుంది. చివరి రోజైన గురువారం నాడు దాదాపు అయిదు లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మహానాడు ప్రాంగణంలోనే బస చేశారు.

కాగా- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు, ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. వారిద్దరూ ఒకే కారులో నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన టీడీపీ, నందమూరి అభిమానులతో కలిసి సమాధి వద్దకు వెళ్లారు. తొలుత కల్యాణ్ రామ్, ఆ తరువాత ఎన్టీఆర్.. సమాధిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళి అర్పించారు. అనంతరం కొద్దిసేపు అక్కడే కూర్చున్నారు. మౌనం పాటించారు. ఆ సమయంలో జూనియర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగంతో కనిపించారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos