ఏపీలో ఇవాళ పెన్షన్ పండుగ ఉంది. ఈసారి జూన్ 1 ఆదివారం రావడంతో.. కూటమి ప్రభుత్వం శనివారమే పెన్షన్లను పంచాలని నిర్ణయించింది. దాంతో ఇవాళ పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ప్రతినెలా సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా పెన్షన్లను స్వయంగా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి చంద్రబాబు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. షెడ్యాలూ ప్రకారం... ఉదయం 11.45కి హెలికాఫ్టర్‌లో జిల్లాకు వెళ్తారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో ‘పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటారు.  అలాగే అక్కడ పీ4 కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5.15కి ఉండవల్లికి బయలుదేరతారు.

జూన్ నెలకి సంబంధించి ప్రభుత్వం అదనంగా 71,380 మందికి పెన్షన్ ఇవ్వబోతోంది. ఇకపై ప్రతి నెలా ఈ అదనపు లబ్దిదారులు కూడా పెన్షన్ పొందుతారు. కొత్త పెన్షన్లలో వితంతు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఇప్పటివరకూ అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియ జరిగిందన్న ప్రభుత్వం.. అది పూర్తవ్వడం వల్ల.. ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇచ్చే పని ప్రారంభమైనట్లు తెలిపింది. అయితే మే నెలలో 63,13,812 మంది లబ్దిదారులు ఉండగా.. అనర్హులను తొలగించిన అనంతరం.. జూన్ 1 నాటికి..  అధికారులు లబ్దిదారుల సంఖ్యను 62,95,526కి తగ్గించేశారు. అంటే.. 18,286 మందిని లిస్టు నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది.


కొత్తగా ఇచ్చే పెన్షన్ల వల్ల ప్రభుత్వంపై రూ.35 కోట్ల అదనపు భారం పడుతుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా జులై నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని అనుకుంటే.. జూన్‌లో దరఖాస్తులను ఆహ్వానించే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు కాబట్టి.. ఆశావహులు ఆ ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos