ఏపీలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవలు ఇవాళ్టి నుంచి నిలిచిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీంతో ఆస్పత్రులు నడపలేక వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. రూ.3500 కోట్ల బకాయిలపై ఇటీవల జిల్లా కలెక్టర్లకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. పేరుకు రైజింగ్ స్టేట్ అని.. కానీ వైద్య సేవలకు దిక్కులేదని... పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని ఆరోపించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా.. వైద్య సేవలు ఆపేశారంటేనే.. ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతున్నదన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారిందన్నారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యిందని విమర్శించారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు గారు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు.

ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని, తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతిచెందినా.. అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని తీవ్రంగా విమర్శించారు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి ..ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని .. కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos