కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ లో కీలక ప్రకటనలు చేసారు. మధ్య తరగతి ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చారు. ఆదాయ పన్ను పరిమితి రూ 12 లక్షలకు పెంచారు. ఎన్నికలు జరగనున్న బీహార్ పై ప్రత్యేక ప్రేమ చూపి వరాలు ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీకి చేసిన కేటాయింపుల పైన చర్చ మొదలైంది. బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటుగా ఐఐటీ విస్తరణ పైన ప్రకటన చేసారు. అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పైన బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

బీహార్ కేటాయింపులతో ఏపీకి కేటాయింపుల పైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ కు ప్రస్తుత బడ్జెట్ లో రూ 5,936 కోట్లు కేటాయించారు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు బడ్జెట్ లో వెల్లడించారు. పోలవరానికి కేంద్రం కేటాయించిన రూ 12,157 కోట్ల ను బడ్జెట్ లో ప్రస్తావించారు. రూ 30,436 కోట్లకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అదేవిధంగా విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీలోనూ ఏపీకి కేటాయింపు లు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos