దేశవ్యాప్తంగా ఉన్న యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఇవాళ శనివారం నాడు 6 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. 'ఆలిండియా బ్రేక్‌డౌన్' పేరుతో జరుగుతున్న ఈ నిరసన కారణంగా మధ్యాహ్నం వరకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు కలిగే అవకాశం ఉంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇతర జాతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. యాప్ కంపెనీలు ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయించడం, డ్రైవర్లను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025"  ప్రకారం, ప్రభుత్వం వెంటనే కనీస బేస్ ఛార్జీలను నోటిఫై చేయాలి. యాప్ కంపెనీలు తమ ఇష్టానుసారంగా ఛార్జీలు తగ్గించకుండా, డ్రైవర్ల యూనియన్లతో చర్చించి ధరలను ఖరారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైట్ బోర్డు (ప్రైవేట్) వాహనాలను కమర్షియల్ ప్రయాణాలకు లేదా వస్తువుల రవాణాకు వినియోగించడాన్ని కఠినంగా నిషేధించాలి. దీనివల్ల కమర్షియల్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు (సుమారు 6 గంటలు) డ్రైవర్లు యాప్‌ల నుంచి లాగ్ అవుట్ అవుతారు. ఓలా (Ola), ఉబర్ (Uber), రాపిడో (Rapido), పోర్టర్ (Porter) వంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో విమానాశ్రయాలకు లేదా అత్యవసర పనులకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను (మెట్రో, ఆర్టీసీ బస్సులు) చూసుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos