ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో వాస్తవాలేమిటనేది వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలేమిటో బయటపెట్టడానికి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఓ ఇండిపెండెంట్ సిట్ ను నియమించింది. తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే కొట్టివేసింది. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు, ప్రజా శాంతి పార్టీ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ ను తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని వ్యాఖ్యానించింది.

తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. "సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాన్ని బయటపెట్టిందని అన్నారు. దోషులు చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కొంటారని తేల్చి చెప్పారు. ఇది కల్తీ మాత్రమే కాదని, కోట్లాదిమంది హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. మన విశ్వాసాన్ని అపవిత్రం, దేశ ఆత్మపై దాడి చేయడంతో సమానమని వ్యాఖ్యానించారు. పవిత్రతతో ఆటలాడిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ.. అంటూ తన ట్వీట్ ను ముగించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos