ఉండవల్లిః భూమిపై హక్కులు కల్పించాలని, వృద్ధాప్య, వితంతు, ఒంటరి పెన్షన్ అందించాలని, అర్హతకు తగ్గ ఉద్యోగ అవకాశం కల్పించాలని, వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉండవల్లిలోని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 58వ రోజు ప్రజాదర్బార్ కు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని వారికి భరోసా ఇచ్చారు. పలు విజ్ఞప్తుల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు..
- తన భార్య పేరుతో ఉన్న 4 ఎకరాల పొలాన్ని తన పేరుతో ఆన్ లైన్ లో నమోదు చేయాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన వై.రామ్ గోపాల్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల క్రితం నా సతీమణి క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ఆమె పేరుపై బాపట్ల మండలం మురుకొండపాడులో 4 ఎకరాల పొలం ఉంది. అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ హక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- సత్రశాల డ్యాం నిర్మాణంలో తమ 3.10 ఎకరాల పొలం ముంపునకు గురైందని, హామీ ఇచ్చిన విధంగా ఐటీఐ చదివిన తనకు అర్హతకు తగిన ఉద్యోగ అవకాశం కల్పించాలని పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఏకోనాంపేటకు చెందిన ఎస్.ఈదయ్య కోరారు. నాకు ఎలాంటి ఆధారం లేదు. ఉద్యోగం కోసం గత పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పరిశీలించి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
- వ్యవసాయం గిట్టుబాటుకాక విజయవాడ వలస వచ్చిన తనకు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని బి.మల్లన్న విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా నందవరం మండలం రాయచోటిలో నివాసం ఉండే తాము ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగుచేయగా నష్టం వచ్చింది. దీంతో గ్రామంలో రూ.6లక్షల వరకు అప్పులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి కోసం కుటుంబంతో సహా విజయవాడ వచ్చిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం సంతేకూడ్లూరులో నెలకొని ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సమ్మర్ స్టోరేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వైసీపీ పాలనలో పెండింగ్ పనులు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమ్మర్ స్టోరేజీ నిర్మాణాన్ని పూర్తిచేయడంతో పాటు ఎగువ ప్రాంతానికి తాగునీటి సరఫరా కోసం మరో రెండు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరు చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- గత వైసీపీ ప్రభుత్వంలో బహుజనులకు సంబంధించి రద్దు చేసి 26 సంక్షేమ పథకాలను పునరుద్ధరించడంతో పాటు ఉద్యమకారులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏలూరుకు చెందిన బహుజన సేన ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. బహుజన ఉద్యమకారులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- వైద్య ఆరోగ్యశాఖ నందు ఎన్ హెచ్ఎమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎల్జీఎస్ గా పనిచేస్తున్న వారి సమస్యలను పరిష్కరించాలని ఏపీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమను కాంట్రాక్టు ఉద్యోగాలుగా గుర్తించడంతో పాటు అర్బన్ ప్రైమర్ హెల్త్ సెంటర్స్ లో ఎల్జీఎస్ లుగా పనిచేస్తున్న వారిని ఎమ్ఎన్వో, ఎఫ్ఎన్వో, ఆఫీసు సబార్డినేట్ గా, కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిణించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- మదర్సాల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లను క్రమబద్ధీకరించడంతో పాటు గత వైసీపీ పాలనలో పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన మదర్సా విద్యావాలంటీర్లు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- తిరుపతి టీఎన్ టీయూసీ అనుబంధ సంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర ఆటో, ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ సభ్యులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత 20 ఏళ్లుగా తిరుపతి, తిరుమలలో ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అద్దె ఇళ్లల్లో జీవనం సాగిస్తున్న తమకు సొంత ఇంటి కల నెరవేర్చాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, పొలకల పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పదో తరగతి పరీక్షా కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు 4 కి.మీల దూరంలోని ఎర్రచెరువుపల్లి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos