ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న‌ అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024ను సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారు. మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్ వేదిక‌గా ఈ స‌మ్మిట్‌ ప్రారంభ‌మైంది. రెండు రోజుల‌పాటు ఈ స‌మ్మిట్ జాతీయ‌స్థాయిలో జ‌రుగుతుంద‌ని అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. డ్రోన్ల వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే టాప్‌లో ఉండేలా ఈ స‌ద‌స్సు తొలి అడుగు కావాల‌ని ఆకాంక్షించారు. ఇలాంటి కార్య‌క్ర‌మం దేశంలోనే మొద‌టిది అని తెలిపారు. అలాగే డ్రోన్స్ అనేవి ఫ్యూచ‌ర్ గేమ్ ఛేంజ‌ర్స్ అని పేర్కొన్నారు. 

ఏపీని డ్రోన్ హ‌బ్‌గా మార్చ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో డ్రోన్ సేవ‌లు కీల‌కంగా మారాయ‌ని గుర్తు చేశారు. రెస్క్యూ బృందాలు కూడా చేరుకోలేని చోటుకు డ్రోన్ల ద్వారా బాధితుల‌కు ఆహారం, మెడిసిన్స్, తాగునీరు అంద‌జేశామ‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లోనూ డ్రోన్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. ఎవ‌రైనా త‌ప్పు చేస్తే లైవ్ విజువ‌ల్స్‌తో స‌హా నిమిషాల్లో ప‌ట్టుకుని శిక్షిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు.

ఇక‌పై డ్రోన్ పైల‌ట్ ప్రాజెక్టుల‌కు ఏపీ వేదిక అవుతుంద‌న్నారు. మ‌రో 15 రోజుల్లో డ్రోన్ పాల‌సీ తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. దీంతో పాటు డ్రోన్ స‌ర్టిఫికేట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఓర్వ‌క‌ల్లులో 300 ఎక‌రాల భూమిని కూడా కేటాయిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. డ్రోన్ కంపెనీల‌కు త‌మ ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. థింక్ గ్లోబ‌ల్లీ.. యాక్ట్ గ్లోబ‌ల్లీ త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పేర్కొన్నారు.  కాగా ఈ సందర్భంగా 50 స్టాళ్ల‌లో డ్రోన్ల ప్ర‌ద‌ర్శ‌న‌, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాల‌సీ ప‌త్రం ఆవిష్క‌ర‌ణ‌, తొమ్మిది ప్యాన‌ల్ డిస్క‌ష‌న్లు త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని అధికారులు తెలిపారు.  

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos