ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాజాగా మండలిలో విపక్ష నేత, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తొలిసారి ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఇందులో వాస్తవం ఎంతనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు ఎవరితో ప్రాణహాని ఉందో పల్లా శ్రీనివాస్ తేల్చిచెప్పేశారు. బొత్సకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పల్లా తెలిపారు. సొంత పార్టీ నుంచే బొత్సకు ప్రాణహాని ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్‌ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పల్లా వ్యాఖ్యానించారు. బొత్స రక్షణ కోరితే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పల్లా హామీ ఇచ్చారు.

విజయనగరం పైడితల్లి జాతరలో తాను కూర్చున్న వేదిక కుప్పకూలిన వ్యవహారంపై సీరియస్ అయిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అంతమొందించాలనే ఇలాంటి నాసిరకం ఏర్పాట్లు చేసారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. దీంతో బొత్స సత్యనారాయణ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. పైడితల్లి జాతరలో తనకు ప్రోటోకాల్ ఉందన్న విషయం మర్చిపోయారా అంటూ ప్రభుత్వం, కూటమి పెద్దలపై, అధికారులపై బొత్స చేసిన విమర్శలు టీడీపీని తాకడంతో దీనికి పల్లా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos