ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన స్ధానిక సంస్ధల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల జాబితాల తయారీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఈ ప్రక్రియపై నిమగ్నమవుతున్నారు. అలాగే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపైనా క్లారిటీ వస్తోంది. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలని ఆదేశించింది. 

ఇలా తయారు చేసిన ఓటరు జాబితాలను మార్చి 9న అధికారికంగా ప్రచురించబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ లెక్కన మార్చి 9న ఓటరు జాబితాల్ని ప్రచురిస్తే.. ఆ తర్వాత ఏ క్షణంలో అయినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. నియోజకవర్గాల పునర్ విభజన, జనాభా గణనతో వీటికి ఎలాగో సంబంధం లేదు కాబట్టి ఈ ఏడాదిలోనే ఈ ఎన్నికల నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos